నేడు నష్టాల బాటే!

SMTV Desk 2019-05-09 19:07:47  Sensex, Nifty, Stock market, Share markets

ముంబై: వరుసగా నాలుగో రోజు గురువారం కూడా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా పతనంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా వాణిజ్య యుద్ధభయంతో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 103.43 పాయింట్ల నష్టంతో 37685 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11328 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ కూడా 14 పైసలు పతనంతో 69.85 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో జీఎంటర్‌టెయిన్‌మెంట్, యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అధికలాభాల్లో దూసుకుపోతుండగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఇన్‌ఫ్రా‌టెల్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.