'మహర్షి' సినిమాపై ప్రేక్షకుల స్పందన....

SMTV Desk 2019-05-09 19:03:53  mahesh babu, maharshi, jagapathi babu

మహేశ్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం మహర్షి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. సినిమా అదిరింది అంటూ ప్రేక్షకులు తమ స్పందనను తెలియజేస్తున్నారు.

ఫస్టాఫ్ లో కాలేజ్ స్టూడెంగా మహేష్ జర్నీ సరదాగా సాగిపోయిందని... ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. సెకండాఫ్ లో రైతుల కోసం మహేష్ చేసిన పోరాటం ఆకట్టుకుందని... ఎమోషన్స్ తో కూడిన క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని అంటున్నారు.

మొత్తమ్మీద మూడు వేరియేషన్స్ లో మహేష్ నట విశ్వరూపం ప్రదర్శించాడని చెబుతున్నారు. విలన్ పాత్రలో జగపతిబాబు మరోసారి మెప్పించాడని అంటున్నారు. మరోవైపు, ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో... భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.