శ్రీవారి సన్నిధిలో రోహిత్, దినేష్ కార్తీక్

SMTV Desk 2019-05-09 18:58:47  dinesh karthik, rohit sharma, tirumala temple

తిరుమల: ముంభై ఇండియన్స్ జట్టు కాప్టెన్ రోహిత్ శర్మ, కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు కాప్టెన్ దినేష్ కార్తీక్ లు తిరుమల దేవస్థానికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున స్వామివారిని కార్తీక్‌ దర్శించుకోగా.. 7 గంటల సమయంలో రోహిత్‌శర్మ స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు రోహిత్‌శర్మ, దినేష్‌కార్తీక్‌లకు ఘన స్వాగతం పలికారు. రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌లు తరచుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. 2017లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత సతీసమేతంగా రోహిత్‌ శర్మ.. వెంకన్నను దర్శించుకున్నాడు.