ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజ..

SMTV Desk 2017-08-25 11:33:01  lord ganesh, governor narasimhan, first pooja organized

హైదరాబాద్, ఆగస్ట్ 25 : నగరంలో వినాయకుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతూ మండపాల వద్ద కోలాహాలం నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఈ దంపతులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం గవర్నర్ దంపతులు పార్వతీ పుత్రుడికి పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్ తదితరులు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 57 అడుగుల మహా గణపతి శ్రీ చండీకుమార అనంత మహా గణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వాడ వాడల్లో కొలువు తీరిన గణేశుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు.