పాక్ మాజీ ప్రధాని మళ్ళీ జైలుకు!

SMTV Desk 2019-05-09 18:47:47  pakistan former prime minister nawaj sharif going to jail

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్ళీ శిక్షను అనుభవించేందుకు లాహోర్ జైలుకు హాజరయ్యారు. అవినీతి కేసులో ఏడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ అనారోగ్య కారణాలతో ఆరు వారాల పాటు బెయిల్‌పై గత మార్చి 26న విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బెయిల్ కాలపరిమితి ముగియడంతో తిరిగి తన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకునేందుకు ఆయన జైలుకు వచ్చారు. అల్ అజీజియా స్టీల్ మిల్స్ అవినీతి కేసులో పడిన ఏడేళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు రద్దు చేసి ఆయనకు ఆరు వారాల బెయిల్‌ను మంజూరు చేయడం జరిగింది. అయితే ఆయనను పాక్ విడిచి వెళ్లరాదన్న నిబంధనను అత్యున్నత న్యాయస్థానం విధించింది. తనకు తీవ్ర అనారోగ్యం ఉందని విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు అనుమతించాలని 69ఏళ్ల షరీఫ్ చేసిన విన్నపాన్ని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. ఈ క్రమంలో బెయిల్ వ్యవధి ముగియడంతో మంగళవారం నాడు జతి ఉమ్రాలోని తన నివాసం విడిచి కోట్‌లక్‌పత్ జైలుకు బయలుదేరారు. పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్‌కు చెంది శ్రేణులు భారీ ప్రదర్శనతో వెంటరాగా కుమార్తె మరియం ర్యాలీకి నాయకత్వం వహించారు.