వొడాఫోన్ నయా ఆఫర్...సిమ్ కార్డ్ ఫ్రీ డోర్ డెలివరీ

SMTV Desk 2019-05-09 14:39:40  vodafone, vodafone new offer, sim door delivery free

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ మరో నూతన సేవలను ప్రవేశపెట్టింది. ఇకపై వొడాఫోన్ సిమ్ కార్డులను ఆర్డర్ చేసిన వారికి ఉచిత డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగానే వొడాఫోన్ ప్రీపెయిడ్ సిమ్‌లకు గాను ఉచిత డోర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో వొడాఫోన్ ప్రీపెయిడ్ 4జీ సిమ్‌ను ఆర్డర్ చేస్తే వారికి ఆ సిమ్‌ను ఉచితంగా డోర్ డెలివరీ ఇస్తారు. అయితే ఇందుకోసం యూజర్లు వొడాఫోన్ ప్లాన్ లోకి మారాల్సి ఉంటుంది. సిమ్ ఉచిత డోర్ డెలివరీ పొందాలంటే వారు రూ.249 రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.దాంతో వారికి రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.కాగా వొడాఫోన్ సిమ్‌ను ఆర్డర్ చేయాలంటే కస్టమర్లు తొలుత ఆ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో ప్రీపెయిడ్ సిమ్ విభాగంలో ఉండే బై నౌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ వెంటనే యూజర్‌కు సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం అడిగి, కొత్త నంబరు కావాలా? లేక ఉన్న నంబరునే ఎంఎన్‌పీ చేయాలా? అని అడుగుతుంది.ఎంఎన్‌పీ చేయించుకోవాలనుకుంటున్న నంబరును మొదటి ఆప్షన్ ఎంచుకుంటే కొన్ని నంబర్లు చూపిస్తుంది. అందులోంచి ఓ నంబరును ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండో ఆప్షన్‌లో మీరు ఎంఎన్‌పీ చేయించుకోవాలనుకుంటున్న నంబరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది.అయితే కొత్త సిమ్ మాత్రమే కాకుండా, ఇప్పటికే వినియోగంలో ఉన్న ఇతర నెట్‌వర్క్‌కు చెందిన సిమ్‌ను కూడా ఎంఎన్‌పీలో వొడాఫోన్‌లోకి మార్చుకోవచ్చు.