ట్రంప్ ట్వీట్...రూ.94,75,664 కోట్ల నష్టం!

SMTV Desk 2019-05-09 14:38:48  trump tweet, share markets, china

సింగపూర్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై పన్నును పెంచుతామని ఆదివారం చేసిన ట్విట్‌తో యావత్ ప్రపంచ మార్కెట్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కేవలం ఒక్క ట్వీట్ తో అంతా ఈవారంలో అంతర్జాతీయంగా స్టాక్స్‌లో దాదాపు 1.36 ట్రిలియన్ డాలర్లు (రూ.94,75,664 కోట్లు) నష్టాన్ని తెచ్చాయి.అంతేకాక జనవరి నుంచి తొలిసారిగా 20 మార్క్‌ను దాటి రెండు రోజుల్లో సిబిఒఇ ఇండెక్స్ 50 శాతం పెరిగింది. అమెరికాచైనా వాణిజ్య సంబంధాలు మరింత క్షీణించగా, మార్కెట్లలో నష్టాల వరద ప్రారంభమైంది. అయితే చైనాకు చెందిన 200 బిలియన్ల దిగుమతి వస్తువులపై పన్నును 10 నుంచి 25 శాతానికి పెంచుతున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ట్విట్టర్‌లో ప్రకటించారు. చైనాతో జరుగుతున్న వాణిజ్య వివాద చర్చల పురోగతి సాధించలేదంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో 200 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ దిగుమతులపై పన్నులను పెంచనున్నట్లు ప్రకటించారు. త్వరలో మరో 325 బిలియన్ డాలర్ల దిగుమతులపైనా 25 శాతం అదనపు సుంకాల విధింపును చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా చైనాసహా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి.