ముంబైలో యాపిల్ స్టోర్

SMTV Desk 2019-05-09 14:37:44  mumbhai, apple store in mumbhai

ముంబై: టెక్నాలజీ రంగ దిగ్గజం యాపిల్ ముంభైలో తన తొలి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యింది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. అలాగే ముంబైలోని పలు ప్రాంతాలను ఐఫోన్ దిగ్గజం ఎంపిక చేసిందని, వచ్చే కొద్ది వారాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. న్యూయార్క్‌లో ఫిఫ్త్ అవెన్యూలో యాపిల్ లొకేషన్, లండన్‌లో రిజెంట్ స్ట్రీట్, ప్యారిస్‌లో చాంప్స్ ఎలిసీస్ మాదిరిగా ఈ రిటైల్ స్టోర్ ఉండవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి యాపిల్ సంస్థ స్థానిక అవసరాలను అందుకోనందువల్ల భారత్‌లో సొంత స్టోర్లను వద్దనుకుంది. అయితే భారత్‌లో తయారీ ఉత్పత్తులను తరలించనుందని, ఈమేరకు రిటైల్ విస్తరణలో భాగంగా భారతీయ ప్రభుత్వంతో సంస్థ చర్చించనుంది. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ యాపిల్ భారత్‌లో సంస్థను విస్తరించేందుకు నానాతంటాలు పడుతోంది. దీనికి కారణంగా షియోమీ, వివో వంటి తక్కువ ఖర్చు కల్గిన బ్రాండ్‌ల భారత్ వినియోగదారులు ఆసక్తి చూపించడమే. అయితే భారత్ వంటి వేగంగా వృద్ధిని సాధిస్తున్న మార్కెట్‌ను వదులుకోవద్దని సంస్థ సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) టిమ్ కుక్ భావిస్తున్నారు. చైనాలో యాపిల్ విక్రయాలు పడిపోతున్న నేపథ్యంలో భారత్ మార్కెట్‌పై సంస్థ దృష్టి పెట్టింది.