పరిశ్రమల్లో ఆర్థికంగా ప్రేరేపించే సైబర్‌దాడులు ఎక్కువ!

SMTV Desk 2019-05-09 14:36:55  cyber crimes, industries

హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల్లో ఆర్థికంగా ప్రేరేపించే సైబర్‌దాడులు ఎక్కువగా ఉన్నాయని మేనేజ్డ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ వెరిజోన్ నివేదిక పేర్కొంది. బుధవారం నాడు 12వ డిబిఐఆర్(డేటా ఉల్లంఘన పరిశోధన నివేదిక) ఎడిషన్‌ను వెరిజోన్ ఆవిష్కరించింది. ఈ నివేదికలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై సైబర్ దాడులు 12 రెట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. 80కి పైగా దేశాల నుంచి సమాచార అంశాలను అందుకున్న నివేదికలో భారత్ నుంచి ఏకైన సభ్యుడిగా తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే డిబిఐఆర్‌లో పాల్గొనే ఏకైన భారతీయ రాష్ట్రంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వంతో వెరిజోన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాన్ మాట్లాడుతూ...దేశంలో జీవనానికి అత్యంత అనుకూలైన నగరం హైదరాబాద్ అని అన్నారు. సమాచార ఉల్లంఘనలపై అందరిలో అవగాహన ఉండాలని అన్నారు. వెరిజోన్ సీనియర్ రిస్క్ అనలిస్ట్ డేవ్ హైలెండర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్రాల నటులకు సంబంధించిన ఉల్లంఘనలు ఎక్కువగా ఉండడం గమనార్హమని అన్నారు.