నటుడు మ్రినల్ ముఖర్జీ ఇక లేరు

SMTV Desk 2019-05-09 14:33:37  mrinal mukerjee

కోల్‌కతా: బెంగాలీ బుల్లి తెర, వెండి తెర నటుడు మ్రినల్ ముఖర్జీ (74) తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జీర్ణకోశ, కామెర్లు వ్యాధితో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మ్రినల్ గత రెండు సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. నటనలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. ఏ పాత్ర చేసిన అందులో ఇమిడి పోయేవారని తోటి నటులు ప్రశంసించిన సంఘటనలో ఎన్నో ఉన్నాయి. బెంగాల్ లో ఫేమస్ షో అమ్లోకి టివి షోలో నటించి తనదైన ముద్ర వేసుకున్నాడు. మ్రినల్ తండ్రి జోజో మంచి నటుడు, సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు. 1955లో దూయి బన్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. నయిక సంగ్‌బద్, గొల్పో హోలియో సొట్టి, శ్రిమాన్ పృధ్వీ రాజ్, చూటి తదితర హిట్ సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.