మహర్షి పబ్లిక్ టాక్ : బొమ్మ బ్లాక్ బస్టర్ గురు

SMTV Desk 2019-05-09 13:47:48  Maharshi

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 వ చిత్రం మహర్షి ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల అయ్యింది. సినిమా విడుదలవుతున్న మే 9 నుంచి 14 రోజుల పాటు, అంటే మే 22 వరకు అన్ని థియేటర్లు రోజుకు 5 షోలు ఆడించవచ్చు. వేసవి సెలవుల్లో ‘మహర్షి’ కోసం ప్రజలు అనేక అంచనాలతో ఎదురుచూస్తున్నారనీ, బ్లాక్ మార్కెటింగ్‌నీ, థియేటర్ల వద్ద జన సందోహాన్ని నిరోధించడానికీ, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవకుండా ఉండటానికీ 5 షోలకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు మహర్షి సినిమా క్రేజ్ ఏమేరకు నెలకొంది అనేది

ఈ సినిమా చూసిన వారు తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తూ తెగ సంబరపడుతున్నారు. ట్రైలర్ లో చెప్పినట్టుగా సినిమా ప్రపంచాన్ని సినిమా ఏలేసే విధంగా ఉందని..అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని అంటున్నారు ఫాన్స్ ..

ఫస్ట్ హాఫ్ యూత్ కోసం క్లాస్ ఆడియన్స్ కోసం అని, సెకండ్ హాఫ్ పక్కా మాస్ కోసం అనే విధంగా సినిమా ఉందని చెపుతున్నారు. రైతులపై సింపతీ కాదు రైతుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకొని వాటికి సొల్యూషన్స్ కనుక్కోవాలని థీమ్ తో సాగే సినిమా అని చెపుతున్నారు. కాస్త ఎక్కువైనా సినిమా నిడివి, కొన్ని సాంగ్స్ తప్పించి సినిమా మొత్తం అదిరిపోయిందని..మహేష్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే అని ధీమా గా చెపుతున్నారు.