మహర్షి ఫస్ట్ హాఫ్ గుడ్ .. మరి సెకండ్ ఆఫ్ సంగతి ఏంటి ?

SMTV Desk 2019-05-09 13:43:37  Maharshi,

మహేష్ కెరియర్‌లో 25 మూవీగా ప్రముఖ దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించింది. గత రాత్రి నుండే థియేటర్స్ వద్ద అభిమానులు కోలాహలంతో థియేటర్స్ అన్నీ సందడిగా మారాయి. ఇప్పటికే యూఎస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బెనిఫిట్ షో‌లు ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ వేదికగా బొమ్మ బ్లాక్ బస్టర్.. బాబు బంగారం.. అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి మహర్షి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని, వంశీ పైడిపల్లి సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం ఎమోషనల్‌గా రూపొందించినట్లు చెబుతున్నారు. అన్నికంటే ముఖ్యంగా మహర్షి కథ అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది.మూవీ తొలి భాగం యూత్ అండ్ క్లాస్ ఆడియన్స్ కోసమని, రెండవ భాగం మాస్ ఆడియన్స్ కోసం.. ఇది ఓవరాల్ గా ఎమోషనల్ జర్నీ అని ఫాన్స్ అంటున్నారు. రైతుల గురించి మంచి సందేశం ఇచ్చారని, సినిమాలో రైతుల ఎపిసోడ్ ప్యూర్ గోల్డ్ అని కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఇది చాలా ఫన్నీ స్టోరీ అని, సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పై కూడా విమర్శలు చేస్తున్నారు.