నీట్ పరీక్షలు వ్రాసిన అభ్యర్దులకు ఒక శుభవార్త

SMTV Desk 2019-05-09 13:41:00  Neet,

వైద్య కోర్సులలో ప్రవేశాలకు నీట్ పరీక్షలు వ్రాసిన అభ్యర్దులకు ఒక శుభవార్త. నీట్ కటాఫ్ మార్కులను 6 శాతం తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీని వలన జనరల్ కేటగిరీలో అభ్యర్దులకు ఇప్పుడు 50కు బదులు 44 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్దులకు కేవలం 34 శాతం, దివ్యాంగులకు 39 శాతం మార్కులు సాధించినట్లయితే మెడికల్‌, పీజీ కోర్సుల్లో అర్హత లభిస్తుంది. ఇది దేశంలో అన్ని రాష్ట్రాలలో నీట్ పరీక్షలు వ్రాసిన అభ్యర్ధులకు వర్తిస్తుంది.