మహర్షి సినిమా లో హిప్పీ ట్రైలర్ ...

SMTV Desk 2019-05-09 13:40:17  Maharshi, Hippi trailer,

ఆర్ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ సెన్సషనల్ స్టార్ అయ్యాడు . తాజాగా హిప్పీ అనే డిఫ‌రెంట్ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు అలరించ దానికి రెడీ అయ్యాడు ఈ చిత్రానికి టి.ఎన్.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌లైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల నతురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ఈ మూవీ టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ఈ నెల 9న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. డిఫ‌రెంట్ కాన్సప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. హిప్పీ అని టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో ఒక‌టే డౌట్. అస‌లు హిప్పీ అంటే ఏంటి అని. ఇదే విష‌యం గురించి డైరెక్ట‌ర్ టి.ఎన్.కృష్ణని అడిగితే.... హిప్పీ అంటే కేర్ ఫ్రీ. కథ కూడా అలాగే ఉంటుంది. కార్తికేయ బాడీలాంగ్వేజ్‌కు చక్కగా సరిపోయే చిత్రం ఇది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ తర్వాత కార్తికేయ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి.

అయితే ఈ ట్రైలర్ మహేష్ బాబు మహర్షి సినిమా బ్రేక్ టైం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .. ఈ నేపథ్యంలో హీరో కార్తికేయ ట్వీట్ చేసాడు .. మహేష్ సర్ సినిమా మహర్షి బ్రేక్ లో నా సినిమా ట్రైలర్ చుడండి అని .. ఈ చిత్రాన్ని జూన్ 7న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు .