స్వామి ఆనంద్‌ గిరి అరెస్ట్ ...

SMTV Desk 2019-05-09 13:36:26  Swamy anand Giri,

యోగాగురు, ఆథ్యాత్మిక బోధకుడుగా పేరొందిన స్వామి ఆనంద్‌ గిరిని పోలీసులు సిడ్నీలో అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళా శిష్యులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలకు గాను ఆనంద్ గిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2016లో ఆస్ట్రేలియాలోని రూటీ హిల్‌లో ఆధ్యాత్మిక ప్రసంగానికి హాజరైన ఆనంద్‌ గిరి ఓ మహిళను వేధించారని ఆరోపణలు ఉన్నాయి.

అదేవిధంగా 2018 నవంబర్‌లో కూడా అదే ప్రాంతంలోని రూటీ హిల్ లో హాజరైన మరో సందర్భంలో కూడా 34 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించారని ఆనంద్ గిరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రస్తుతం ఆస్ర్టేలియాలోని ఆరు వారాలు పర్యటనలో ఉన్న స్వామి ఆనంద్‌ గిరిని మే 5న సిడ్నీలో అరెస్ట్‌ చేశారు.

అంతేకాకుండా ఆనంద్‌ గిరి బెయిల్‌ కోసం స్వామీజీ తరఫున లాయర్ పిటిషన్ వేయగా.. అప్పీల్‌ను కోర్ట్ తిరస్కరించి కస్టడీకి తరలించింది. అలాగే జూన్‌లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.