ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ .. హైదరాబాద్ పై ఢిల్లీ విజయం

SMTV Desk 2019-05-09 13:06:03  Delhi, Hyderabad,

వైజాగ్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ పృథ్వీషా (56), రిషబ్ పంత్(49)లు చలేరేగి రాణించారు. దీంతో ఢిల్లీ జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ లు తలో 2 వికెట్లు పడగొట్టగా… దీపక్ హుడా ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్ గుప్తిల్ 36, మనీష్ పాండే 30, కేన్ విలియమ్సన్ 28, విజయ్ శంకర్ 25, నబీ 20 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్‌ 3, ఇషాంత్‌ శర్మ 2 వికెట్లు పడగొట్టగా… అమిత్‌ మిశ్రా ఒక వికెట్‌ తీశాడు. దీంతో హైదరాబాద్ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది . శుక్రవారం జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ కేపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత 12న జరిగే ఫైనల్‌లో ముంబైతో తలపడుతుంది.