భారీ ఆఫర్ కొట్టేసిన అందాల భామ

SMTV Desk 2019-05-09 13:05:12  Anu Emanuel,

మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అను ఇమ్మాన్యుయెల్ ఆ తర్వాత స్టార్ ఛాన్సులు అందుకున్నా లాభం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ నా పేరు సూర్య లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ రాబట్టుకున్నా ఆ సినిమాలు ఫెయిల్ అవడంతో అనుకి ఆ తర్వాత ఛాన్సులు రాలేదు. తెలుగులో దాదాపుగా అమ్మడి కెరియర్ ముగిసినట్టు అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా అమ్మడికి కోలీవుడ్ నుండి లక్కీ ఆఫర్ వచ్చింది. అక్కడ యువ హీరో శివ కార్తికేయన్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

సొంత టాలెంట్ తో పైకొచ్చిన శివ కార్తికేయన్ కు కోలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ ను సెలెక్ట్ చేశారట. తెలుగులో ఎలాగు లక్ కలిసి రాలేదు.. మరి అమ్మడికి కనీసం తమిళంలో అయినా హిట్లు పడతాయేమో చూడాలి. తెలుగులో ఐరన్ లెగ్ అనిపించుకున్న చాలామంది తమిళంలో సక్సెస్ అయ్యారు. ఆ లెక్కన చూస్తే అను ఇమ్మాన్యుయెల్ కూడా కోలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది.