విజయ్ సినిమాలో ఆ సీన్ కేక?

SMTV Desk 2019-05-09 13:04:02  Vijay Devarakonda, Rashmika,

యువ హీరో విజయ్ దేవరకొండ లిప్ లాక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా నుండి విజయ్ నటించిన ప్రతి సినిమాలో లిప్ లాక్ కచ్చితంగా ఉంటూ వస్తుంది. గీతా గోవిందం సినిమాలో రష్మికతో లిప్ లాక్ హంగామా చేయగా ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలాలో కూడా హీరోయిన్ తో లిప్ లాక్ చేశాడు. టాలీవుడ్ ఇమ్రాన్ హష్మిగా మారుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా రష్మికతో ఘాటు అదరచుంభనం లాగించాడు. టీజర్ లోనే లిప్ లాక్ పెట్టారంటే ఇక సినిమాలో విజయ్, రష్మికల రొమాన్స్ కు తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఇదిలాఉంటే డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ నటిస్తున్న క్రాంతి కుమార్ డైరక్షన్ లో మూవీ రాబోతుంది. ఆ సినిమాలో కూడా విజయ్ హీరోయిన్ తో లిప్ లాక్ చేస్తాడట. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉంటారని తెలుస్తుంది. క్రాంతి మాధవ్ సినిమాలో ఏకంగా 2 నిమిషాల లిప్ లాక్ సీన్ ఉంటుందట. సుధీర్ఘంగా సాగే ఈ లిప్ లాక్ ఎంతో కళాత్మకంగా ఉంటుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ లిప్ లాక్ నే హిట్టు సెంటిమెంట్ గా భావిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.