'మహర్షి' లో ఇదే టర్నింగ్ పాయింట్

SMTV Desk 2019-05-09 12:58:27  maharshi, prakash raj, mahesh babu, vamsi paidipally

ప్రకాష్ రాజ్ లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఉండవ్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఒకప్పుడు మహేష్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎదో ఒక రోల్ లో కనిపించేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కథలను బట్టి సినిమా యూనిట్ యాక్టర్స్ ని ఎంచుకోవడంతో అప్పుడపుడు ఈ సీనియర్ యాక్టర్ మహేష్ సినిమాలో మిస్ అవుతున్నాడు.

ఇక ఇప్పుడు మహర్షి సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య సాగే సంభాషణ సినిమాలో హైలెట్ టర్నింగ్ పాయింట్ అని టాక్. మెయిన్ గా కథను మలుపుతిప్పడంలో ప్రకాష్ రాజ్ పాత్ర కీలకమని తెలుస్తోంది.

ఇప్పటికే సాంగ్స్ టీజర్ ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. గురువారం సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు - పివిపి - అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు.