రజినీకాంత్ సినిమానా.......మజాకా!!

SMTV Desk 2019-05-09 12:57:00  rajinikanth, darbar, rajinikanth 167

రజినీకాంత్ కెరీర్ లో 167వ చిత్రం దర్బార్ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సర్కార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద 200కోట్ల బిజినెస్ చూపించిన దర్శకుడు ఏఆర్.మురగదాస్ ఇప్పుడు సూపర్ స్టార్ తో అంతకంటే ఎక్కువ స్థాయిలో రికార్డ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.

సినిమాకు సంబందించిన ప్రతి విషయంలో మురగదాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ దర్శకుడు విలన్స్ ని ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సారి రజిని సినిమాలో కూడా విలనిజం డోస్ పెంచుతున్నాడు. విభిన్న పాత్రల్లో ఇద్దరు ప్రముఖ నటులను విలన్స్ గా చూపించనున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ నుంచి ప్రతీక్ బబ్బర్ ను ఒక విలన్ క్యారెక్టర్ కి ఫిక్స్ చేసిన మురగదాస్ మరో మెయిన్ విలన్ కోసం మలయాళ నటుడు చంబన్ వినోద్ జోష్ ని ఎంచుకున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇదివరకే ఈ సంస్థ సూపర్ స్టార్ తో 2.0 సినిమాను నిర్మించింది. ఇక వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.