మేం తప్పకుండా గెలుస్తాం....కానీ దానికి కారణం మాత్రం మేము కాదు: భోజ్‌పురి స్టార్ యాక్టర్

SMTV Desk 2019-05-09 12:47:17  dinesh laal yadav, bjp candidate, bhojpuri star actor

ప్రధానిగా మోదీని ప్రజలు కోరుకుంటున్నారని అజంగఢ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ తెలిపారు. భోజ్‌పురి స్టార్ యాక్టర్ అయిన ఆయన.. అజంగఢ్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సహ నటులు మనోజ్ తివారి, రవి కిషన్‌ల గెలుపుపై స్పందించారు. తాము గెలవబోతున్నామని.. అయితే ఆ గెలుపుకి కారణం తాము కాదని.. ధర్మం పక్కన నిలవడమే కారణమన్నారు. ప్రజా అవసరాలేంటో తమకు తెలుసు అన్నారు. నిజాలేంటో చెప్పడానికే తాను అజంగఢ్‌లో ప్రచారం చేస్తున్నానని ఆయన చెప్పారు. అజంగఢ్‌లో మే 12న ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను దినేశ్ లాల్ ఎదుర్కోబోతున్నారు.