ఎయిర్‌టెల్ హాట్‌స్పాట్ కస్టమర్లకు గుడ్ న్యూస్

SMTV Desk 2019-05-09 12:37:26  airtel, airtel 4g hotspot

టెలికం రంగ దిగ్గజం ఎయిర్‌టెల్ తన 4జీ హాట్‌స్పాట్ డివైస్ కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక నుండి ఆ డివైస్‌లో వాడే ఎయిర్‌టెల్ సిమ్‌కు గాను ఇకపై రూ.399 ప్లాన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఇక ఆ ప్లాన్‌లో కస్టమర్లకు నెలకు 50 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. డేటా అయిపోగానే స్పీడ్ 80 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఇక ఈ హాట్‌స్పాట్ డివైస్‌ను వినియోగదారులు రూ.999 కే అమెజాన్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. కాగా రూ.399 ప్లాన్‌లో ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ డివైస్‌కు వచ్చే 50 జీబీ డేటాను పూర్తిగా వినియోగించకపోతే మిగిలిన డేటా మరసటి నెలకు క్యారీ ఫార్వార్డ్ అవుతుందని కూడా ఎయిర్‌టెల్ తెలిపింది..