సెమీ ఫైనల్స్‌లో చేరే జట్లు ఇవే: కపిల్ దేవ్

SMTV Desk 2019-05-09 12:30:49  kapil dev, icc world cup 2019, team india

వరల్డ్ కప్ గురించి తాజాగా లెజెండ్ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి వరల్డ్ కప్‌ను గెలుచుకునే సత్తా టీమిండియాకు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత జట్టులో యువరక్తంతో పాటు అనుభవం సమపాళ్లలో ఉన్నాయని ప్రశంసించాడు. అయితే జట్టు కూర్పుతో పాటు అవసరమైన సమయంలో ఆటగాళ్లు రాణించడం చాలా ముఖ్యమని విషయమని తెలిపారు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్స్‌లో చోటు సాధించే అవకాశం ఉందని అంచనా వేసిన కపిల్ దేవ్.. సెమీస్‌లో నాలుగో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడతాయన్నారు. ఇక ఈ టోర్నీలో న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు కపిల్. మరోవైపు హార్దిక్ పాండ్యా జట్టులో ఉండడం టీమిండియాకు కలిసివచ్చే అంశమని చెప్పారు. పాండ్యాను అతని సహజశైలిలో ఆడనివ్వాలని సూచించారు.