మూడేళ్ళలోపు రెట్టింపు ఆదాయం!

SMTV Desk 2019-05-09 12:21:10  infosys, it compenys, annual income, market shares

బెంగాళూరు: సాఫ్ట్‌వేర్‌ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రానున్న మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా తమ ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. అయితే ప్రస్తుతం భారత్‌ నుండి ఇన్ఫోసిస్‌కు దాదాపు 270 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తోంది. ఈ మేరకు భారత్‌లో అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తోంది. ఈ సందర్భంగా భారత్‌లో 500 మిలియన్‌ డాలర్ల ఆదాయం పొందాలన్నది లక్ష్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు.