ఫేస్ బుక్ పరిచయం ఆమె ప్రాణాలు తీసింది

SMTV Desk 2019-05-08 17:43:44  woman died, facebook friends, hyderabad lodge

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక అభ్యుదయనగర్ లోని ఒయో లాడ్జిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం......ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ పేరు సంగీత. బెంగాల్ కు చెందిన ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం ‘ఫేస్ బుక్’ ద్వారా యువకుడు లోకేశ్ ఆమెకు పరిచయమయ్యాడని చెప్పారు. లోకేశ్ కోసం హైదరాబాద్ కు ఆమె వచ్చినట్టు తెలిసిందని అన్నారు. గత మూడు రోజులుగా వీళ్లిద్దరూ కలిసి ఒయో లాడ్జిలో ఉన్నారని చెప్పారు.

నిన్న రాత్రి వారి మధ్య గొడవ జరిగినట్లు లాడ్జి సిబ్బంది ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగీత వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు కాగా, లోకేశ్ వయసు 28 ఏళ్లు ఉండొచ్చని పోలీసుల విచారణలో తెలిసినట్టు సమాచారం.