సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రకుల్ డాన్స్ వీడియో

SMTV Desk 2019-05-08 17:37:22  rakul preet, de de pyaar de, choreographer melvin louis

డాన్స్ విషయంలో హీరోలతో సమానంగా హీరోయిన్స్ వేయడం కాస్త కష్టం..చాలామంది లో ఒకరు ఇద్దరు మాత్రమే హీరోలకు సమానంగా డాన్స్ వేస్తారు..మిగత వారు వేస్తారు కానీ చాల బ్రేక్స్ తీసుకుంటారు . అయితే రకుల్ మాత్రం అందరిలా కాదు అంటూ డాన్స్ ఇరగదీసింది. ఏకంగా డాన్స్ మాస్టర్ తో పోటీ పడి మరి వేసి అబ్బా అనిపించింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ హౌలి హౌలి పాటకు కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయీస్ తో కలిసి వేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈమె హిందీ లో నటించిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం మే 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకుంది. ఎలాగైనా ఈ సినిమా తో హిట్ అందుకొని బాలీవుడ్ లో బిజీ కావాలని చూస్తుంది. చిత్ర ప్రొమోషన్లో భాగంగా కొరియోగ్రాఫర్ మెల్విన్ తో కలిసి డాన్స్ చేసిన వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.