దోచుకున్న వారిని, అవినీతిపరులను ఈ చౌకీదార్ వదిలిపెట్టడు: మోదీ

SMTV Desk 2019-05-08 17:31:52  congress, bjp, modi, priyanka gandhi

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్రమోదీ. హర్యాణాలోని ఫతేహాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ అవినీతి పరుడైన రాబర్ట్ వాద్రాను వదిలేది లేదని స్పష్టం చేశారు.

మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే రాబర్ట్ వాద్రా జైలుకు వెళ్లక తప్పదని చెప్పుకొచ్చారు. దోచుకున్న వారిని అవినీతిపరులను ఈ చౌకీదార్ వదిలిపెట్టడని హెచ్చరించారు. న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేస్తాడని హెచ్చరించారు.

ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై స్పందించారు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. ప్రధాని నరేంద్రమోదీ తనను గత ఐదేళ్లుగా నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడని, తనను వేధిస్తున్నాడని ఆరోపించారు. తనను జైలుకు పంపుతామని బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ చెప్పుకొచ్చారు.