ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్

SMTV Desk 2019-05-08 17:31:01  ipl 2019, csk vs mi, rohit sharma

చెన్నై: మంగళవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై ని చిత్తు చేసి ముంభై ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ముంభై జట్టు కాప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ... మేం బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాం. ఎలాంటి పరిస్థితులల్లోనైనా పోరాడగల సత్తా ఉంది. బ్యాట్స్‌మెన్‌కు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. చెన్నై వంటి మైదానాల్లో విజయం సాధించగలిగామంటే మైదానాన్ని త్వరగా అర్థం చేసుకోవడమే అని అన్నాడు. అలాగే 54 బంతుల్లో 71 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌పై రోహిత్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.