వీటిలో ఒక్కటైనా నెరవేర్చారా? : అనుపమ్ ఖేర్ ను ప్రశ్నించిన ఓ వ్యక్తి

SMTV Desk 2019-05-08 17:29:48  anupam kher, kiran kher, bjp, chandigarh candidate

బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సరిగ్గా రెండు రోజుల క్రితం జనాలు లేక ఆయన సభ రద్దయింది. ఈ రోజు ఆయనకు మరో షాక్ తగిలింది.

అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ చండీగఢ్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో, ఆమె తరపున అనుపమ్ ఖేర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన ఒక షాపులోకి వెళ్లారు. బీజేపీకి ఓటు వేయాలని షాపు ఓనరును కోరారు.

అయితే... బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? మీకు ఎందుకు ఓటు వేయాలని సదరు షాపు యజమాని ప్రశ్నించాడు. అంతేకాదు 2014లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి... వీటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటు ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక చేసేందేం లేక... అనుపమ్ ఖేర్ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.