రేపటి నుంచి తెలంగాణకు భారీ వర్ష సూచన

SMTV Desk 2017-08-24 17:48:31  TELANGANA WEATHER REPORT

హైదరాబాద్, ఆగస్ట్ 24 : తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖా వెల్లడించింది. కోస్తాపై ఉపరితల౦ మీద ఏర్పడిన ఆవర్తనం కారణంగా రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న 24 గంటల్లో తెలంగాణలో ఎక్కువ చోట్ల, కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని రోజుల నుండి వర్షాలు పెరుగుతు౦డడంతో ఆందోళనకర పరిస్థితుల నుంచి ఏపీ బయటపడగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో మాత్రం ఇంకా లోటు కొనసాగుతోంది. రెండు రోజులుగా వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నా, అత్యధికంగా మిర్యాలగూడ, కొణిజెర్ల, రామన్నపేటల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.