మద్యం మత్తులో నగ్నంగా ఫోటోలు తీసి......బ్లాక్ మెయిల్ చేసాడు

SMTV Desk 2019-05-08 16:03:27  social media, teenage boy, alcohol addiction, nude pics

మద్యం మత్తులో తోటి రూమ్మెట్ ని నగ్నంగా ఫోటోలు తీశారు. తర్వాత ఆ కుర్రాడికి తన నగ్న ఫోటోలు చూపించి.. డబ్బులు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. నిజంగానే తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతారని బయపడిన ఆ కుర్రాడు... గదిలో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మృతుడు టీనేజ్ కుర్రాడు. అతను.. బోయిసార్ అనే వ్యక్తితో కలిసి ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. బోయిసార్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం టీనేజ్ కుర్రాడు, బోయిసార్, మరో వ్యక్తి కలిసి మద్యం సేవించారు.

మద్యం మత్తులో టీనేజర్ నిద్రలోకి జారుకోగా... అతని దుస్తులు విప్పి.. నిందితుడు నగ్నంగా ఫొటోలను తీశాడు. తెల్లారి లేచిన తర్వాత ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. మొదట జోక్‌ చేస్తున్నాడని టీనేజర్‌ భావించాడు. కానీ బెదిరింపులు నిజమని తేలడంతో టీనేజర్ బయపడిపోయాడు. తర్వాత అద్దె గదిలో ఒంటరిగా ఉన్న బాధితుడు ఉరేసుకొని మృతిచెందాడు.

పోలీసుల దర్యాప్తులో బోయిసార్ నిందితుడని తేలింది. నిందితుడి నుంచి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫొటోలు డిలీట్‌ చేయాల్సిందిగా టీనేజర్‌ ప్రాధేయపడుతూ చేసిన మెసేజ్‌లను నిందితుడి ఫోన్‌లో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు.