రేపు మహర్షి రిలీజ్ - ఈ రోజు ఐటీ సోదాలు

SMTV Desk 2019-05-08 14:34:01  maharshi, dil raju, tollywood, mahesh babu

టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ తన బ్యానర్ ఇమేజ్ ని రోజురోజుకి పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్ హీరోగా రూపొందిన మహర్షి సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రేపు సినిమా రిలీజ్ కు ఉండగా.. ఈరోజు దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ సోదాలు జరిగాయి. సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. గతంలోనే పలు భారీ చిత్రాల రిలీజ్ సమయంలో నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి.

ఇది ఇలా ఉండగా.. మహర్షి సినిమాకు తెలంగాణాలో అదనపు షోలకు ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరామని.. దానికి పర్మిషన్ దొరికిందని చెప్పారు. అలానే టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా కోర్టు అనుమతించినట్లుగా తెలిపారు.

కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని తేల్చి చెప్పింది. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ కలిసి నిర్మించారు.