యురేనియం నిలువలను పెంచేదిశలో ఇరాన్

SMTV Desk 2019-05-08 14:30:00  uranium iran

ఇరాన్ దేశం అంతర్జాతీయ అణు ఒప్పందంలోని కొన్ని కీలక అంశాల నుంచి తప్పుకొని తమ యురేనియం నిలువలను పెంచుకోవాలని సన్నహాలు చేస్తుంది. యురేనియంను విదేశాలకు అమ్మడం కాకుండా, తమ వద్ద వాటిని సమృద్ధిగా నిలువ చేసుకోవాలని ఇరాన్ భావిస్తున్నట్లు దేశాధ్యక్షుడు హసన్ రోహనీ తెలిపారు. శుద్ధీకరించిన యురేనియం ఉత్పత్తిని రానున్న 60 రోజుల్లో మరింత పెంచనున్నట్లు రోహనీ వార్నింగ్ కూడా ఇచ్చారు. గత ఏడాది అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడంతో పరిస్థితి తారుమారైంది. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించాలన్న ఉద్దేశంతో ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా ఇరాన్ చర్యలతో అప్రమత్తమైన అమెరికా తన యుద్ధ నౌకను గల్ఫ్ జలాలవైపు మళ్లించింది.