సైరాలో తమన్నా పాత్ర ఇదేనన్న మాట!

SMTV Desk 2019-05-08 13:33:01  tamannah, saira, chiranjeevi next, f2

మొన్నటి వరకు ఐరెన్ లెగ్ అని ఊహించని బరువును మోసిన తమన్నా F2 సక్సెస్ తో ఆ ముద్రను చెరిపేసుకుంది. ప్రస్తుతం అమ్మడు మంచి ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమాలో కూడా తమన్నా ముఖ్య పాత్రలో కనిపించనుంది. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఆమెకు సంబందించిన సీన్స్ సినిమా కథలో కీలక మలుపని సమాచారం.

తమన్నా క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ అని టాక్ వస్తోంది. ఉయ్యాలవాడ నరసిమహారెడ్డి రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి మహారాణి గా పన్నాగం పన్నుతుందట. ఆ క్యారెక్టర్ నెగిటివ్ షెడ్ లో ఉండటం విశేషం. సినిమాలో హీరోయిన్ గా మెగాస్టార్ సరసన నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ప్రత్యేక గీతంలో అనుష్కను కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఎక్కువగా తమన్నా క్యారెక్టర్ సినిమాలో మంచి ట్విస్ట్ ఇస్తుందని ఇన్ సైడ్ టాక్. సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు సినిమాలో కీలక పాత్రలో కనిపించిననున్నారు.