అలియా భట్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు

SMTV Desk 2019-05-08 13:30:22  alia bhat, kalank, netiens, social media trolling

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై జనాల దృష్టి బాగా పెరిగిపోయింది. వారికి సంబంధించిన చిన్న విషయం ఏం దొరికినా దాన్ని విమర్శిస్తూ కామెంట్స్ చేయడం బాగా ఎక్కువైంది. తాజాగా నెటిజన్ల ట్రోలింగ్ కి బలైంది అలియా భట్.

ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ముంబై నుండి లండన్ కి వెళ్తున్న సమయంలో ఆమె కార్లే లెగర్ ఫెల్డ్ బ్రాండ్ కి చెందిన లేటెస్ట్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది. ఈ బ్యాగ్ ధర ఆరు లక్షలు. అయితే ఈ బ్యాగ్ మోడల్ లో రెండు బ్యాగ్స్ ఉంటాయి. అలియా ఆ బ్యాగ్ వేసుకొని ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.

అంతే.. ఆ బ్యాగ్ చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. లండన్ కి బ్యాగ్ లు అమ్మడానికి వెళ్తున్నావా..? అని ఒక నెటిజన్ అడిగితే మరో నెటిజన్ బస్ కండక్టర్ కి ఈ బ్యాగ్ బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. మరికొంతమంది ఈ విషయంలో అలియా బాయ్ ఫ్రెండ్ రణబీర్ ని లాక్కొచ్చి అతడి సెలెక్షనా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆమె నటించిన కలంక్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే సినిమా సినిమాలో నటిస్తోంది. అలానే తెలుగులో రాజమౌళి RRR సినిమాకు సైన్ చేసింది.