మార్కెట్లోకి వచ్చిన నోకియా 4.2

SMTV Desk 2019-05-08 13:25:07  nokia, nokia 4.2

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తన నూతన స్మార్ట్ ఫోన్ నోకియా 4.2ను మంగళవారం (మే 7న) భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజీతో వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. బ్లాక్‌, పింక్‌ శాండ్‌ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ప్రస్తుతానికి నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో మాత్రమే ఈ ఫోన్ లభ్యంకానుంది. వారంరోజుల్లో అన్ని ప్రముఖ మొబైల్‌ విక్రయ దుకాణాల్లో అందుబాటులోకి తేనున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ వెల్లడించింది. ఫోన్ ప్రత్యేకతలు: ✦ 5.71 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
✦ స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌
✦ ఆండ్రాయిడ్‌ 9

✦ 3జీబీ ర్యామ్‌
✦ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ
✦ 13 + 2 డ్యుయల్‌ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
✦ డ్యుయ‌ల్ సిమ్‌
✦ డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
✦ బ్లూటూత్ 4.2,
✦ 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం .