నష్టాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు

SMTV Desk 2019-05-08 13:24:18  Sensex, Nifty, Stock market, Share markets

ముంబై: బుధవారం కూడా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరుగుతుండడం దీనికి కారణం. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా నష్టపోగా... నిఫ్టీ సైతం 70 పాయింట్ల మేర పతనమైంది. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 275.95 (0.72 శాతం) నష్టంతో 38000.68 వద్ద తచ్చాడుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 78.40 (0.68 శాతం) క్షీణించి 11419.50 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఆరంభంలో 1.57 శాతం మేర అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఆర్ఐఎల్, ఓఎన్జీసీ, వేదాంత, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఎస్పీఐ తదితర షేర్లు ఉన్నాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్, ఎస్ బ్యాంకు, సన్ ఫార్మా తదితర షేర్లు 0.82 శాతం మేర అత్యధిక లాభాలను నమోదు చేసిన జాబితాలో ఉన్నాయి. కాగా నిన్న చైనా-అమెరికా ట్రేడ్ వార్ భయాల కారణంగా సెన్సెక్స్ 323 పాయింట్ల మేర నష్టపోయి 38,276 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నిఫ్టీ సైతం 100 పాయింట్ల మేర నష్టపోయి 11,497 వద్ద ముగిసింది.