మరో ప్రాణాన్ని నిలబెట్టిన గో ఫండ్ మి

SMTV Desk 2019-05-08 12:30:25  A girl Coma after Racist attack in America go fund me company, go fund me company

వాషింగ్టన్: అమెరికాలోని గో ఫండ్ మి అనే సంస్థ మరో బాలికకు ఆసరాగా నిలిచింది. ఈ 13 ఏండ్ల బాలిక చికిత్స ఖర్చుల కోసం 6 లక్షల డాలర్లకు పైగా ధనం సేకరించింది ఆ సంస్థ. పూర్తి వివరాల ప్రకారం....ఏప్రిల్‌లో ఇండో అమెరికన్ బాలిక ధృతి నారాయణ్ అనే మహిళా రోడ్డు దాటుతుండగా ఓ వాహనదారుడు తను ముస్లిం అమ్మాయి అనుకోని కావాలనే తనపై వాహనాన్ని ఎక్కించాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. చికిత్సకు భారీ వ్యయం అవుతుండటంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. కోమాలోకి వెళ్లిన బాలికకు రోజులు గడుస్తున్న కొద్ది ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటంతో వారు నిస్సహాయ స్థితిలో పడ్డారు. ఈ దశలో గో ఫండ్ మి అనే సంస్థ ఈ బాలికకు సాయం కోసం ఆన్‌లైన్‌లో అభ్యర్థించింది. దీనికి స్పందనగా దాదాపు 13వేల మంది ముందుకు వచ్చి విరాళాలు అందించారని, ఈ విధంగా ఆరు లక్షల డాలర్ల వరకూ పోగయిందని సంస్థ తెలిపిందని అమెరికన్ బజార్ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ తెలిపింది. గత నెల 23వ తేదీన తండ్రి రాజేష్ నారాయణ్, సోదరుడు తొమ్మిందేళ్ల ప్రకార్‌తో కలిసి కాలిఫోర్నియాలోని సన్నీవలేలో రోడ్ దాటుతుండగా ఇసాహ్ పీపుల్స్ అనే వ్యక్తి వేగంగా తన వాహనాన్ని వారిపైకి పోనిచ్చినట్లు, కూతురు తీవ్రంగా గాయపడగా తండ్రి స్వల్పంగా గాయపడ్డట్లు వెల్లడైంది. విషయాన్ని తెలుసుకుని ఫండ్ మి సంస్థ ఏడు రోజుల క్రితం ప్రకటన వెలువరించింది. ఓ వ్యక్తి విషపూరిత చర్యతో గాయపడ్డ బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆమె త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నామని, అయితే ఇందుకు ఆ తరువాత ఈ కుటుంబ పునరావాసానికి కావల్సిన అత్యధిక మొత్తం ప్రధాన సమస్య అని, దీనిపై స్పందించే దాతల కోసం వేచిచూస్తున్నామని సంస్థ తెలిపింది.