చెత్త ఆటతీరుతో మొత్తం నాశనం అయిపోయింది: మాల్ల్యా

SMTV Desk 2019-05-08 12:27:43  rcb, ipl 2019, virat kohli, vijay mallya

బెంగుళూరు: ఈ ఐపీఎల్ సీజన్లో కూడా పేలవ ప్రదర్శనతో ఇంటి దారి పట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై ఫ్రాంచైజీ మాజీ యజమాని విజయ్ మాల్యా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎప్పుడు చూసినా బెంగళూరు టీమ్ లో మంచి ఆటగాళ్లు ఉంటారని, కానీ ఆ బలం అంతా కాగితాలపైనే అని మరోసారి రుజువైందని ట్వీట్ చేశారు. పరమచెత్త ఆటతీరుతో మొత్తం నాశనం అయిపోయిందంటూ వాపోయారు. అంతకుముందు, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వచ్చే ఏడాది మరింత పట్టుదలతో బరిలో దిగుతామని పోస్టు పెట్టాడు. దానికి స్పందనగానే విజయ్ మాల్యా ట్వీట్ చేశారు.