విండీస్ ను చిత్తు చేసిన బంగ్లాదేశ్

SMTV Desk 2019-05-08 12:23:40   westindies vs bangladesh

వెస్టిండీస్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం డబ్లిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్ (80; 7 ఫోర్లు), సౌమ్య సర్కార్‌ (73; 9 ఫోర్లు, 1 సిక్స్‌)లు మంచి ఆరంభం ఇచ్చారు. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం షకీబుల్‌ (61 నాటౌట్‌ 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రహీం (32)లు మిగతా పని పూర్తి చేశారు. టాప్ ఆర్డర్ అర్ధ సెంచరీలు చేయడంతో బంగ్లాదేశ్‌ 45 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది. విండీస్ ఓపెనర్ షై హోప్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.మొదటగా బ్యాటింగ్ చేసిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్‌ షై హోప్‌ (109; 11 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో సెంచరీ చేశాడు. రోస్టన్‌ ఛేజ్‌ (51; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేసాడు. ఓపెనర్ల అనంతరం ఛేజ్‌ మాత్రమే పరుగులు చేసాడు. మిగతా బ్యాట్స్‌మన్‌ విఫలమవడంతో విండీస్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. బంగ్లా బౌలర్లలో మొర్తజా మూడు.. సైఫుద్దీన్‌ రెండు వికెట్లు తీశారు.