సుకుమార్ కథలో హీరో మాత్రమే చేంజ్.....మిగితాదంతా సేం-టూ-సేం

SMTV Desk 2019-05-08 12:16:52  mahesh babu, sukumar, allu arjun, anil ravipudi

రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్..ఏడాది గా ఖాళీగా ఉండడం..మరో సినిమా మొదలు పెట్టకపోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. వాస్తవానికి రంగస్థలం హిట్ కాగానే వెంటనే మహేష్ తో ఓ సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. ఆ మేరకు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే రస్టిక్ స్టోరీ సైతం సిద్ధం చేసి మహేష్ కు వినిపించాడు.

కథ విన్న మహేష్ ఓకే అన్నట్లు చెప్పడం తో సుక్కు వెయిట్ చేసాడు. తీరా సెట్స్ పైకి సినిమాను తీసుకెళ్లడం అనే నేపథ్యంలో అనిల్ రావిపూడి చెప్పిన కథ ఇంకా బాగుండడం తో సుక్కు ను పక్కకు పెట్టి అనిల్ కు ఓకే చేసాడు మహేష్.

మహేష్ నో చెప్పడం తో సుకుమార్ అదే కథను ఏ మాత్రం మార్చకుండా అల్లు అర్జున్ కు చెప్పడం జరిగింది. కథ బాగుండడం తో బన్నీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహేష్ తో చేద్దామనుకున్న మైత్రి వారు బన్నీ తో చేయబోతున్నారు. ఆలా సుక్కు కథలో హీరో మాత్రమే చేంజ్ అయ్యాడు కానీ నిర్మాతలు, కథ అన్ని అవేనట. అతి త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని బన్నీ సన్నాహాలు చేస్తున్నాడు. ఫ్రస్టూహతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.