నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను: సమీరారెడ్డి

SMTV Desk 2019-05-08 12:15:08  sameera reddy, jai chiranjeeva, ashok, narasimhudu

#మీటూ ఉద్యమంతో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయ్. సీనియర్, యంగ్ హీరోయిన్స్ తమకు ఎదురైన లైంగిక వేధింపులని బయటపెట్టారు. ఇందులో కొన్ని సంచలనంగా మారాయి. బాధితులు కొందరు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. మరికొందరిపై ఆరోపణలపై న్యాయస్థానంలో విచారణలు జరుగుతున్నాయి. తాజాగా, సీనియర్ హీరోయిన్ సమీరారెడ్డి సంచల వ్యాఖ్యలు చేసింది. తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది.

ఇటీవల తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీరా మాట్లాడుతూ.. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, హీరోయిన్ గా ఓ రేంజ్ కి చేరుకొన్న తర్వాత కూడా వేధింపులకు గురయ్యాను. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ఆట వస్తువులా చూస్తున్నారు. కొత్తగా వచ్చే హీరోయిన్స్ నుంచి పడక సుఖం కోరుకుంటారు. అంతే కాకుండా కమిట్ మెంట్ అడిగిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. తెలుగులో సమీరారెడ్డి నరసింహుడు, జై చిరంజీవి అశోక్ తదితర సినిమాల్లో నటించింది.