ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి

SMTV Desk 2019-05-08 11:57:37  chennai road accident, family members died, railway police

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిని మహారాష్ట్రకు చెందిన రైల్వే పోలీసులు అధికారి మెల్విన్‌ దేశ్‌ముఖ్‌ కుటుంబ సభ్యులుగా గుర్తించారు.

తమిళనాడు యాత్రకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.