ఈ వేసవి కాలంలో గ్యాస్ ఆదా చేయండి ఇలా....

SMTV Desk 2019-05-08 11:55:03  making dosa, hot oil, social media, viral videos

ఉదయం 11 గంటలు దాటిందంటే చాలు.. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయట కాలు పెట్టడానికే వణికిపోతున్నారు. అయితే, నెటిజనులు ఎండను కూడా వాడేసుకుంటున్నారు. జోకులతో నవ్విస్తున్నారు. ఎండల తీవ్రతను చెప్పేందుకు క్రియేటీవ్‌గా ఆలోచిస్తున్నారు.

చౌకీదార్ షాలినీ బాజ్‌పేయ్.. అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎండ తీవ్రత చెప్పేందుకు ఓ వ్యక్తి యాక్టివా సీటు మీద దోసలను వేశాడు. వేడి తీవ్రతకు త్వరగానే దోస సిద్ధమైపోయింది. మరో వీడియోలో ఓ మహిళ నూనెతో నింపిన మూకుడును బయట మేడపై పెట్టింది.సూర్యుడి వేడికి అది వేడెక్కగానే అందులో బజ్జీలు వేసింది. వారు కావాలనే అలా చేశారా లేదా నిజమా అనే విషయాలను పక్కన పెడితే.. ఎండ తీవ్రత దంచికొడుతుందనేది మాత్రం వాస్తవం అని ప్రజలు చెబుతున్నారు.