నిషా అగర్వాల్ రీ-ఎంట్రీ ఇవ్వబోతుందా?

SMTV Desk 2019-05-08 11:51:01  kajal, nisha agarwal, tollywood heroine, heroine sister

స్టార్ హీరోయిన్ కాజల్ పనైపోయిందని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఐతే, కాస్త పుంజుకొని మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది చందమామ. అయినా… ఇంకా చాన్నాళ్లు హీరోయిన్ గా కొనసాగే ఓపిక కాజల్ లో కనబడటం లేదు. ఆమె మనసు పెళ్లిపై పడింది. సంబంధాలు చూస్తున్నారు. కుదిరితే మూడుముళ్లు వేయించుకోనుంది. మరోవైపు, కాజల్ చెల్లులు నిషా అగర్వాల్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

హీరోయిన్ గా నిషా.. ఓ మోస్తారుగా ఆకట్టుకొంది. ఐతే, అక్క కంటే ముందే పెళ్లి చేసుకొని సంసార జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమెకి కొడుకు కూడా పుట్టాడు. ప్రస్తుతం నిషా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆమెకి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు? ఆ సినిమా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. పెద్దగా క్రేజ్ లేని నిషా రీఎంట్రీతో హీరోయిన్ గా రాణిస్తుందేమో చూడాలి.