క్వాలిఫయర్ మ్యాచ్‌: బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

SMTV Desk 2019-05-08 11:48:59  ipl 2019, first qualifier match, csk vs mi

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ చేపాక్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన ముంబయి జట్టు 9 మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా.. చెన్నై కూడా 9 విజయాలు సాధించినా.. నెట్‌ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో టాప్-2 నిలిచిన ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా.. ఓడిన టీమ్‌కి రెండో క్వాలిఫయర్‌ ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఐపీఎల్ ఇప్పటి వరకూ 26సార్లు ఈ రెండు జట్లూ తలపడగా.. ముంబయి ఏకంగా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. చెన్నై 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. టోర్నీలోని అన్ని జట్లపైనా చెన్నై ఆధిపత్యం చెలాయిస్తే..? చెన్నైపైనే ఆధిపత్యం చెలాయించగలిగే ఏకైక జట్టు తామేనని ముంబయి ఇండియన్స్ చాలాసార్లు నిరూపించుకుంది. ఎంతలా అంటే.. చెన్నై సొంతగడ్డ చెపాక్‌లో 2010 నుంచి ఒక్కసారి కూడా చెన్నై చేతిలో ముంబయి ఓడిపోలేదు. దీంతో.. ఈరోజు మ్యాచ్‌లో చెన్నైపైనే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

Chennai Super Kings (Playing XI): Shane Watson, Murali Vijay, Faf du Plessis, Suresh Raina, MS Dhoni(w/c), Ambati Rayudu, Dwayne Bravo, Ravindra Jadeja, Harbhajan Singh, Deepak Chahar, Imran Tahir .

Mumbai Indians (Playing XI): Quinton de Kock(w), Rohit Sharma(c), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Krunal Pandya, Kieron Pollard, Jayant Yadav, Rahul Chahar, Jasprit Bumrah, Lasith Malinga .