ఆ రెండు పార్టీల వల్ల ప్రమాదం పొంచి ఉంది ..

SMTV Desk 2019-05-08 11:48:10  Akhilesh Yadav,

సమాజ్‌వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు జేపీఎస్ రాథోడ్ యూపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. యూపీలోని బలరాంపూర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురను అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తూ నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మైనర్ బాలురను ప్రచారానికి వాడుకోవడం మానవత్వం కాదని పేర్కొన్న రాథోడ్ దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. అయతే దేశంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే నని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజలు ప్రాథమిక అవసరాలను కూడా కోల్పోతారని,ఈ రెండు పార్టీల వల్ల ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో సామాన్య ప్రజానీకానికి మోదీ చేసిందేమీ లేదని ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ అయితే పేద ప్రజలను పట్టించుకోలేదని అఖిలేష్ ధ్వజమెత్తారు.