అప్పుడే పుట్టిన పసికందుతో వైద్యుల నిర్లక్ష్య ప్రవర్తన....వీడియో వైరల్

SMTV Desk 2019-05-08 11:42:05  doctors dropping newborn in Chandler, family wants answers, Baby Being Dropped On Head At Arizona Hospital

మంలో చేతి నుంచి జారవిడిచారు. దాంతో ఆ చిన్నారి తల భాగం మొదట కింద తాకింది. అయితే, పాప పడిన చోటు మెత్తగా ఉండడంతో ప్రమాదం తప్పింది. అదే నేలపై పడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆ సమయంలో చిన్నారి తల్లిదండ్రులు తీసిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొనిక్ రోడ్జర్, డెరిక్ అనే దంపతులకు ఫిబ్రవరి 14న కవల ఆడపిల్లలు పుట్టారు.తన కూతుళ్లను చేతిలో తీసుకునే మధురక్షణాల కోసం ఎదురుచూస్తున్న డెరిక్… వైద్యులు డెలివరీ చేసిన అనంతరం తన బిడ్డలను శుభ్రం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో ఓ చిన్నారిని వైద్యులు నిర్లక్ష్యంగా చేతిలోంచి జారవిడిచిన దృశ్యాన్ని చూసి డెరిక్ కు గుండె ఆగినంత పనైంది. చిన్నారి తల్లి మొనిక్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పసిగుడ్డును వైద్యులు చాలా ఘోరంగా ట్రీట్ చేశారని చెప్పింది. క్లీనింగ్ ప్రాస్సెస్ అయిపోయిన తరువాత డెరిక్ వెళ్లి వైద్యులను మీరు నా బిడ్డను చేతి నుంచి జారవిచారని నిలదీస్తే అతన్ని అదొలా చూశారట. దాంతో తాను తీసిన వీడియోను డెరిక్ వైద్యులకు చూపించాడు. అది చూసిన వైద్యులకు నోటమాట రాలేదట. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యాన్ని ఫిర్యాదు చేయగా… రోగులు వారి కుటుంబాల భద్రతేకే తాము తొలి ప్రాదాన్యత ఇస్తామని చెప్పారట. దాంతో డెరిక్ తన చిన్నారి పట్ల వైద్యులు వ్యవహరించిన వీడియోను వారికి చూపించాడట. దాంతో ఆస్పత్రి యాజమాన్యం సదరు వైద్యుల పట్ల చర్యలు తీసుకుంటామని తెలిపినట్టు సమాచారం. మొన్నీమధ్య పాకిస్తాన్ లో ఓ డాక్టర్ తనకున్న ఎయిడ్స్ వ్యాధిని 90మంది రోగులకు అంటించిన సంగతి తెలిసిందే. మరో దగ్గర తలనొప్పితో ఆసుపత్రికి వెళ్ళిన రోగి జుట్టు కత్తిరించి పంపారు. ఇలా రోజురోజుకి వారి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి.