ధోనికి ప్రీతి జింటా స్వీట్ వార్నింగ్!

SMTV Desk 2019-05-08 11:36:07  csk, kxip, ipl 2019, mahendra singh dhoni, prteety zinta

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యజమాని ప్రీతి జింటా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కింగ్స్‌ XI పంజాబ్‌ తాజా ఐపీఎల్‌ సీజన్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. చివరిగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరువికెట్ల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో సమానంగా 12 పాయింట్లు సాధించినప్పటికీ రన్‌రేట్‌ (-0.251)తక్కువగా ఉండటంతో ఆ జట్టు పాయింట్ల పట్టిక ఆరోస్థానానికి పరిమితమైంది. దీంతో ప్లే ఆఫ్‌కు చేరుకోలేకపోయింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత చెన్నైపై విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రీతిజింటా ట్వీట్‌ చేశారు. మైదానంలో నవ్వుతూ ధోనీతో కరచాలనం చేస్తున్న ఫోటోను పోస్టు చేశారు.తాను కెప్టెన్‌ కూల్‌కు అభిమానినని, ఈ మధ్య కాలంలో తన దృష్టి ధోనీ కుమార్తె జీవాపై పడిందని ట్విట్టర్‌లో రాశారు. నేను ధోనీని చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.. ఆయన కుమార్తె జీవాను నేను కిడ్నాప్‌ చేయొచ్చు అని రాసుకొచ్చారు. దీనికి ఓ లాఫింగ్‌ ఎమోజీని కూడా ఆమె జత చేశారు.