దొంగల పాలైన తెలంగాణ : ఉత్తమ్

SMTV Desk 2017-06-03 12:13:31  uttamkumar, congress,sonia gandhi

హైదరాబాద్, జూన్ 3 : విద్యార్ధులు, యువకులు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తెచ్చుకున్న తెలంగాణా ఇప్పుడు దొంగల పాలైందని పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ సేవాదళ్ అధ్వర్యంలో గాంధీ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ అయన భాద్యతలను మరిచి ఫాం హౌజ్ లో కునుకు తీస్తున్నారని అయన విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియా గాంధీని ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం చాల దారుణమని విమర్శించాడు. రాజకీయంగా ఆంధ్రా ప్రాంతంలో భారీ నష్టం జరిగిన తెలంగాణా ప్రజల కళలను సోనియా గాంధీ నెరవేర్చారు. రాష్ట్రం లో అవినీతి దోపిడీ పెరిగిపోయాయని ప్రజల అవసరాలను పాలకులు గుర్తించడం లేదని అన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబ సభ్యుల స్వార్ధం తప్ప ఉద్యమ సమయంలో ఇచ్చిన అంక్షలు మాత్రం నెరవేర్చడం లేదని అన్నారు. ఈ కార్యకమంలో టీపీసీసీ వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.